royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana22వ వార్డు 100 రోజుల ప్రగతి నివేదికను విడుదల చేసిన… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 12:46 pm
Date of Publish : 28 May 2026, 5:28 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 25 💬 5
Latest News

22వ వార్డు 100 రోజుల ప్రగతి నివేదికను విడుదల చేసిన కౌన్సిలర్ జాలిగం విగ్నేష్

22వ వార్డు 100 రోజుల ప్రగతి నివేదికను విడుదల చేసిన కౌన్సిలర్ జాలిగం విగ్నేష్

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి మే 28/ కౌన్సిలర్ గా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతి నివేదికను విడుదల చేయడం జరిగింది. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో 100 రోజుల్లో సుమారు 10 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో కూడా ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకువచ్చి వార్డును అభివృద్ధి చేస్తామని, దానికి ప్రజలందరూ సహకరించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరడం జరిగింది. వేసవిలో ఎటువంటి సమస్య రాకుండా 3 మోటార్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జాలిగం శివ, ప్రమోద్, మని, వరుణ్, దినేష్, రాజేందర్, మహేందర్, రాము, ప్రసన్న కుమార్, భరత్ తదితరులు పాల్గొన్నారు.