royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaబక్రీద్ ఏర్పాట్లపై సమీక్ష – జనగామ ఈద్గా వద్ద మొదటిసారి… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 12:25 pm
Date of Publish : 28 May 2026, 4:44 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 30 💬 5
Latest News

బక్రీద్ ఏర్పాట్లపై సమీక్ష – జనగామ ఈద్గా వద్ద మొదటిసారి టెంట్ ఏర్పాటు………………..ముస్లింల కోరిక మేరకు కలెక్టర్ చొరవతో ఈద్గాలో టెంట్ ఏర్పాటు……

బక్రీద్ ఏర్పాట్లపై సమీక్ష - జనగామ ఈద్గా వద్ద మొదటిసారి టెంట్ ఏర్పాటు
ముస్లింల కోరిక మేరకు కలెక్టర్ గారి చొరవతో ఈద్గాలో టెంట్ ఏర్పాటు

రాయల్ పోస్ట్ న్యూస్ జనగామ మే 28/ : బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు జనగామ జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ శ్రీ సందీప్ కుమార్ ఝా గారి అధ్యక్షతన కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో పీస్ కమిటీ సమావేశం జరిగింది.
పీస్ కమిటీ సమావేశంలో ముస్లింలు ఈద్గా వద్ద ఎండాకాలం దృష్ట్యా మొదటిసారి టెంట్ ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ గారు వెంటనే స్పందిస్తూ మున్సిపల్ కమిషనర్ జనగామను ఆదేశిస్తూ, ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపాలిటీ తరఫున టెంట్, తాగునీటి సదుపాయం, ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. అంతేకాకుండా ఫైర్ ఇంజన్ మరియు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు - వారి ప్రత్యేక ఆదేశాలతో ఈద్గా వద్ద మున్సిపాలిటీ తరఫున బక్రీద్ సందర్భంగా మొదటిసారి టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ శ్రీమతి బాలమణి శ్రీనివాస్ మరియు మున్సిపల్ కమిషనర్ జనగామ గారి ప్రత్యేక కృషి అభినందనీయం.

ఏర్పాట్లు చేసినందుకు కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ గారికి అనేక ధన్యవాదాలు. జమాతే షబాబ్ కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.

జనగామ ఈద్గాలో వేలాది మంది ముస్లింలు ఈద్ నమాజ్ ఆచరించారు. ఈద్ నమాజ్‌ను మౌలానా షాకిర్ హుస్సేన్ గారు చదివించారు.

ఈద్గా వద్ద జనగామ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి బాలమణి శ్రీనివాస్, డీసీపీ జనగామ శ్రీ రాజా మహేంద్ర నాయక్ గారు, సీఐ జనగామ శ్రీ సత్యనారాయణ రెడ్డి మరియు ఇతరులు కలిసి ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు.