royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaయువజన – విద్య రంగాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 11:46 pm
Date of Publish : 28 May 2026, 4:39 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 115 💬 27
Latest News > తక్షణ వార్తలు > యాదాద్రి భువనగిరి

యువజన – విద్య రంగాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నాం….

యువజన – విద్య రంగాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నాం

ఉద్యోగాలు, విద్య, భవిష్యత్తు కోసం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం

కల్లూరు ధర్మేంద్ర
ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

దేశ భవిష్యత్తు అయిన యువతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని,ఒకవైపు నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతుండగా, మరోవైపు విద్యను కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి నెట్టివేస్తూ సామాన్య విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారని, యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న పాలకుల వైఖరిని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) తీవ్రంగా ఖండిస్తోందని కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఏఐవైఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా సమితి సమావేశం భువనగిరి లోని సీపీఐ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

 ఈ సందర్బంగా *ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర*. మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేసిందన్నారు . ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగ అవకాశాలను కుదిస్తోందన్నారు . రైల్వేలు, బ్యాంకులు, రక్షణ రంగం, విద్యుత్ రంగాల్లో ఖాళీలను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ విధానాన్ని ప్రోత్సహిస్తోందని, ప్రశ్నపత్రాల లీకేజీలు, నియామకాలలో ఆలస్యం, పరీక్షల రద్దులు యువతలో తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయని విమర్శించారు. ఇక విద్యారంగంలో నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తూ, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారన్నారు . ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల లేమి, ఫీజుల పెంపు వంటి సమస్యలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు . రాష్ట్ర ప్రభుత్వం కూడా యువజన – విద్య సమస్యల పరిష్కారంలో స్పష్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు . 

      ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను నిలిపివేయాలని, ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ విద్యాసంస్థలకు తగిన నిధులు కేటాయించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలని,

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

 ఈ సందర్బంగా *సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి*. మాట్లాడుతూ పాలకులు నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు, విద్యార్థి హాస్టళ్లు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాల్లో యువత తీవ్ర అసంతృప్తితో ఉందన్నారు . ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆ దిశగా సరైన ప్రణాళికలు కనిపించడం లేదన్నారు .

ఈ పరిస్థితుల్లో యువత భవిష్యత్తును కాపాడేందుకు ఏఐవైఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని వారు తెలిపారు.

  ఈ సమావేశంలో  ఏఐవైఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. నయీమ్, జిల్లా సమితి సభ్యులు నర్సింహా చారి, శోభన్ బాబు, ఆనంతుల నర్సింహా, కంబాల రాజు, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.