
రాయల్ పోస్ట్ న్యూస్ నల్గొండ మే 27/ భారతదేశంలో రామరాజ్యమే గ్రామ రాజ్యం దేశానికి వెన్నుముక రైతు రైతే రాజు రైతే అనే ఆయన లేకపోతే మనుగడే లేదు. భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకులు రైతు పేరుతో మోసాలు చేస్తారు. రైతుకు అది కల్పిస్తాం "రైతుకు ఇది ఇస్తాం" ఉచిత రుణమాఫీ "రెండు లక్షల రుణమాఫీ" రైతు భరోసా పథకాలతో" పీఎం కిసాన్ నిధి లాంటి పథకాలతో ఒక్క రూపాయి ఇచ్చి 99 పైసల్ లాగే మాదిరిగా ఉన్నవి రైతు పథకాలన్నీ కూడా". రైతు గోస పట్టించుకోని ప్రభుత్వాలు ఎక్కువ కాలము మనుగడ సాధించినట్టు ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు .ప్రతి చోట ప్రతి రాజకీయ పాలకుడు రైతు పేరు వాడకపోతే రాజకీయాలు లేవనే మాదిరిగా వ్యవహరిస్తూ.. రైతుకు" యూరియా ఫ్రీగా ఇస్తాం" రైతుకు కరెంట్ ఫ్రీగా ఇస్తాం" నీళ్లు ఫ్రీగా అందిస్తాం "రవాణా ఫ్రీగా ఇస్తాం" రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తాం" మైకుల ముందల చెప్పడం తప్పితే అమలు అయ్యేది మాత్రం చాలా తక్కువే .. రైతుని ఇబ్బంది పెట్టేది రాజకీయ పాలకులే ఒకప్పుడు దేశం మొత్తం నిరక్షరాస్యులు రైతులుగా ఉండేవారు.. ఈరోజు ఆ పరిస్థితి మారిపోయింది. మంచిగా చదువుకున్న యువతే వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా మార్చడం కోసం వ్యవసాయ రంగాన్ని ఎంచుకుంటున్నారు.. భారత వ్యవసాయ రంగంలో ఇప్పటికీ 50 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారే. అలాంటి వ్యవసాయ రంగంపై ఆధారపడిన వ్యవసాయ శ్రామికులు వ్యవసాయదారులు అందర్నీ కూడా మోసం చేస్తున్నది రాజకీయ పాలకులే .మేమే ఫలానాలకు ఆనకట్ట నిర్మించమని" విద్యుత్ ఉత్పత్తి మావలనే అయిందని" మేమే రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించమని గొప్పలు చెప్పుకుంటున్న రాజకీయ పాలకులు రైతు పేరుతో మోసాలు చేస్తున్నది వారే .రాజకీయ పాలకులే రాజకీయ పాలకులను గమనించి మీ ఓటు హక్కు సక్రమంగా వేయండి. ఓట్లు వేసుకున్న తర్వాత మిమ్ములను వాడేస్తున్నది వారే వారికి తగిన సమాధానం చెప్పండి ..మీ హక్కులని పరిరక్షించుకోండి మేమే రైతు రాజ్యం తెచ్చినమని చెప్పుకుంటున్న వాళ్లకు తగిన బుద్ధి చెప్పండి.. రైతు అని ఆయన లేకపోతే పర్యావరణం పరిరక్షణ లేకపోతే ఈ భూమి మీద ఒక్క జీవం కూడా జీవించలేదు.. కొద్దికొద్ది కాలంలోనే భూమిపై జీవం నశించిపోతుంది .సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి .రైతు రాజ్యపాలకుడు అయినప్పుడు మాత్రమే రైతులందరూ రాజు.. రైతులు రాజకీయ పాలకుడు పాలకుడు అయినప్పుడు మీకు ఎలాంటి అవకాశాలు లభించవు. రైతు పేరు చెప్పకపోతే రాజకీయాలు లేవనే భావన ఆధునిక రాజకీయ పాలకులకు అవగాహన కలిగింది.
కొండ కృష్ణ
9676273325