royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaముస్లిం సోదరులకు విన్నపంగో వధ ఖుర్బానీ బహిష్కరించండి | Boycott… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 7:08 pm
Date of Publish : 22 May 2026, 6:55 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 151 💬 34
Latest News

ముస్లిం సోదరులకు విన్నపంగో వధ ఖుర్బానీ బహిష్కరించండి | Boycott Cow Qurbani

ముస్లిం సోదరులకు విన్నపం
గో వధ ఖుర్బానీ బహిష్కరించండి | Boycott Cow Qurbani

రాయల్ పోస్ట్ న్యూస్ జనగామ మే 22/ఏక్ మినార్ మసీదు, జనగామ నుండి మసీదు కమిటీ ప్రెసిడెంట్ గా నేను, జమాల్ షరీఫ్ Advocate, శుక్రవారం నమాజ్ అనంతరం మన ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

1. ఖుర్బానీలో ఆవులు, ఎద్దులు వద్దు:
ముస్లిం సోదరులారా, దయచేసి ఆవులను, ఎద్దులను, దూడలను ఖుర్బానీ ఇవ్వడమే మానేయండి. కేవలం మేకపోతులు, గొర్రెపోతులనే - పొట్టేళ్లనే ఖుర్బానీ ఇవ్వండి.

2. తెలంగాణ ముస్లింలారా గమనించండి:
ఈ నెల 28వ తేదీన వస్తున్న బక్రీద్ పండుగకు ఎద్దులను, దూడలను, ముసలి ఆవులను, చిన్న పిల్లలను అస్సలు కొనకండి.

3. ఇస్లాం చెప్పింది ఇదే:
ఖుర్బానీకి మంచి ఆరోగ్యవంతమైన జంతువు ఉండాలి. ఖుర్బానీలో న గోష్త్, న ఖూన్ అల్లాహ్ కు చేరదు, కేవలం నియ్యత్ మాత్రమే చేరుతుంది.

4. ఫర్జ్ మర్చిపోవద్దు:
మనకు నమాజ్ ఫర్జ్. దానిని వదిలేసి ఇతర పనుల్లో టెన్షన్ పడుతున్నాం. కానీ అల్లాహ్ దగ్గర ఫర్జ్ గురించే ప్రశ్న ఉంటుంది.

5. ఉన్నదాంట్లోనే పంచుదాం:
మీకు శక్తి ఉంటే మేకపోతులు, గొర్రెపోతులు ఖుర్బానీ ఇచ్చి పేద ముస్లింలకు పంచండి. ఇవ్వలేని వారు ఏమాత్రం బాధ పడకండి. అల్లాహ్ అర్థం చేసుకుంటాడు. ఉన్న పరిస్థితులను అల్లాహ్ చూస్తాడు.

6. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి:
గోవును మన యొక్క జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వెంటనే జాతీయ జంతువుగా ప్రకటించాలి.

7. శాంతియుతంగా ఉందాం:
పరిస్థితి బాగాలేనప్పుడు లేనిపోని గొడవలకు కారణం కాకండి… దయచేసి.

Boycott Beef, Cows..
Boycott Cow Qurbani 🙏