
మహేశ్వరంలో అభివృద్ధి పై సబితా ఇంద్రారెడ్డి చర్చకు సిద్ధమా కాకి ఈశ్వర్ ముదిరాజ్ డిమాండ్
రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం మే 22:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ సబితా ఇంద్ర రెడ్డి సిరిగిరి పురం గ్రామం లో రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శించడం తప్పు అని ఆయన అన్నారు గత రెండు సంవత్సరాల నుండి మహేశ్వరం గ్రామంలో 2 కోట్ల 50 లక్షలు రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సహకారంతో ఎస్ డి ఎఫ్, హెచ్ ఎం డి ఏ, ఇతర సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి పనులు సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఐమాక్స్ లైట్లు, పాఠశాల ప్రహరీ గోడ, తదితర పనులు చేశామన్నారు. ఈ యొక్క పనులు సబిత ఇంద్రారెడ్డికి కనబడుటలేదని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇవన్నీ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయని ప్రజలు రైతులు యువకులు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉండటం వీరికి ఇష్టం లేక ముసలి కన్నీరు కారుస్తున్నారని వీరి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని కాకి ఈశ్వర్ ముదిరాజ్ జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చకు సిద్ధం మా అని సవాలు విరిసిరారు సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో ఆమె కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి మూడుసార్లు మంత్రి పదవి అనుభవించి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ లో చేరి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ తరపున మరొక్కసారి కాంగ్రెస్ పాలను విమర్శించకూడదని హెచ్చరిస్తున్నాము.