royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaవివోఏల డిమాండ్లనుప్రభుత్వం అమలు చేయాలి … › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 12:19 pm
Date of Publish : 22 May 2026, 6:26 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 41 💬 15
Latest News

వివోఏల డిమాండ్లనుప్రభుత్వం అమలు చేయాలి …

వివో ఏల గౌరవ వేతనం..ఉద్యోగ భద్రత..పని బారం తగ్గించాలి.

ఐదవ రోజుకు చేరుకున్న వివోఏల సమ్మె.

రాయల్ పోస్ట్ న్యూస్ యాదాద్రి భువనగిరి మే 22 :

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల విశ్రాంతి భవనంలో శుక్రవారం రోజు ఐకెపి వివోఏ రిజిస్ట్రేషన్ నెంబర్ 363/2025 , రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు తమ హక్కులు సమస్యల పరిష్కారం సాధనకై సంఘటితమై రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో 8 మండలాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం శాంతియుత సమ్మె నిరసన కార్యక్రమం 5వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు మోలుగురి శిరీష , బీసు భాగ్యలక్ష్మి , ఉపాధ్యక్షురాలు రజిత రాణి , జిల్లా కార్యదర్శి బండ రామ నర్సయ్య , కోశాధికారి వీరమల్ల సునీత పాల్గొని మాట్లాడుతూ వివోఏల సమస్యలను పరిష్కరిస్తామంటూ వివోఏల కుటుంబ సభ్యుల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం వివోఏల సమస్యలను పట్టించుకోక కాలయాపన చేయడం సరి కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యలు వివోఏ లకు కనీస గౌరవ వేతనం 20000 ఇవ్వాలి , ఎస్.ఈ.ఆర్.పి ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి , అర్హులైన వివోఏలకు సిసి ప్రమోషన్లు ఇవ్వాలి , వివోఏ లకు సాధారణ బీమా సౌకర్యం కింద 20 లక్షల భీమా రక్షణ కల్పించాలి , ట్యాబ్ సౌకర్యం కల్పించాలి , జీవో 58 సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మా సమస్యలను అమలు చేయని యెడల రాష్ట్రవ్యాప్తంగా ఈ శాంతియుత నిరసన సమ్మెను మరింత ఉధృతం చేసి డి ఆర్ డి ఓ , జిల్లా కలెక్టర్ కార్యాలయంను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 8 మండలాల అధ్యక్షులు కార్యదర్శులతో పాటు సభ్యులు పాల్గొన్నారు.