
రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి మే 22/ తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ (ఐ) మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా న్యాయం చేయాలనుకుంటే ప్రొ॥ కోదండరామ్ గారిని కమిటి చైర్మన్ చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని "తెలంగాణ ఉద్యమకారుల సంఘం" రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు,
శుక్రవారం రోజున స్థానిక బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో జరిగిన ఉద్యమకారుల ముఖ్యుల సమావేశములో పూస శ్రీనివాస్ మాట్లాడుతు 1969 సం॥రములో జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని కాసు బ్రహ్మానందారెడ్డి నాశనం చేసినాడని పాలమూరు, ప్రజాప్రతినిధులు పోయి మా తెలంగాణ కోసం ఏమైన సహాయం ప్రభుత్వం చేయాలని కోరితే నీకోసం మాట్లాడు తెలంగాణ అభివృద్ధి, పాలమూరు అభివృద్ధి కోసం మాట్లాడవద్దు అని అన్నాడని, ఆరోజు కాస్తు బ్రహ్మానందారెడ్డి వద్ద కాపలాదారుడుగా పనిచేసిన కె. కేశవరావు ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగదని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ప్రొ॥ కోదండరామ్ను చైర్మన్ను చేస్తే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని పూస శ్రీనివాస్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కొడిమాల కృష్ణ, గొర్ల లక్ష్మణ్, గోపరాజు గణేష్, డి.ఎస్. మాణిక్యమ్మ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు