
అర్హులైన ప్రతి ఒక్కరు పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలి షేక్ హాజీ బాబా
మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా
( రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం మే 22:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా ఓ కార్యక్రమం లో మాట్లాడుతూ
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోప్రజా సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించే దిశగా చర్యలలో భాగంగా తమ గ్రామపంచాయతీ కార్యాలయాలలో నూతన పెన్షన్ దారుల దరఖాస్తులను తేదీ 22-05-2026 నుండి 25-05-2026 వరకు స్వీకరించడం జరుగుతుంది. అర్హులైన పెన్షన్ దారులందరు కింది పత్రాలతో హాజరై ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందవలసిందిగా మనవి.
పాస్ ఫోటో,ఆధార్ జిరాక్స్,రేషన్కార్డ్ జిరాక్స్
బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్
ఓటర్ కార్డ్ జిరాక్స్ వికలాంగులు/వితంతువులు/ఒంటరి మహిళలు/వృద్ధుల - సర్టిఫికెట్స్ లు జిరాక్స్లు తమ తమ గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా ఈ ప్రకటనలో తెలిపారు