రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి మే 19/ రాష్ట్ర
ఉద్య మకారుల సంఘం రాష్ట్ర,అధ్యక్షులు పూస శ్రీనివాస్ గారికి యాదాద్రి భువనగిరి,జిల్లా ముస్లిం జేఏసీ,ఆధ్వర్యంలో భువనగిరి పట్టణం లోని అమరవీరుల స్తూపం వద్ద పూల మాల వేసి శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం లో ముస్లిం మైనారిటీ లు అందరు
ఏక తాటి పైకి వచ్చి ఆమరణ నిరాహార దీక్షలు సైతం చేసారని గుర్తు చేసారు. అలాగే మలిదశ ఉద్యమం లో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రం వచ్చే దాక పోరాటం చేసారని అన్నారు.ప్రభుత్వం కూడ తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న ముస్లిం మైనారిటీ లకు కూడ న్యాయం చేయాలనీ అన్నారు..