రాయల్ పోస్ట్ న్యూస్ గుండాల మే 19/ గుండాల మండలం రామారం గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యురాలు కానగంటి మంజుల గారు కరెంట్ షాక్‌కు గురై మృతిచెందడం చాలా బాధాకరం.వారి మృతిచెందిన వార్త తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గారు రామారం గ్రామానికి చేరుకొని మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మంజుల గారి పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తామని హామీ ఇచ్చారు. మంజుల గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.