- పార్టీ అంతర్గత విషయాలపై మీడియా సమావేశంలో స్పష్టత
- సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తన తీరు మార్చుకోవాలని హితవు
- రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యం
గజ్వేల్, 21 జూలై 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుంచి నోటీస్ రావడం అనేది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారమని, ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు దారం గురువారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురువారెడ్డి మాట్లాడుతూ ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసమే నూతన కమిటీని నియమించడం జరిగిందని, తామెప్పుడూ పార్టీకి వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. బీజేపీ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న నిబద్ధత కలిగిన కార్యకర్తలను కాపాడుకోవలసిన బాధ్యత నాయకులందరిపై ఉందన్నారు. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేస్తున్నామన్నారు. తన తీరు మార్చుకోవాలని సూచించారు. పార్టీ పదవిని అడ్డుపెట్టుకుని వసూళ్లకు పాల్పడటం సరైన పద్ధతి కాదని, ఇకనైనా అటువంటి కార్యక్రమాలను స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి, పార్టీని కాపాడేందుకు, బలోపేతం చేసేందుకు కృషి చేయాలని హితవు పలికారు. గజ్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎంతో బలంగా ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షులు రాములు, కార్యవర్గ సభ్యులు పవన్ కుమార్, అనంత్ సాయి పాల్గొన్నారు.
