రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 30/ భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2012–13 వ సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మానవత్వంతో తల్లి లేని చిన్నారులకు ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డి గూడెంకు చెందిన గంగాదేవి జ్యోతి ఇటీవల మృతి చెందారు. ఆమెకు కుమార్తె నందిత, కుమారుడు ఉన్నారు. తల్లి మరణంతో చిన్నారులు అనాధలైనారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బస్వాపురం గ్రామంలో 2012,13 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు నందిత పేరుమీద పోస్టాఫీస్ లో కిసాన్ వికాస్ పత్రం (కే వీ పీ) కింద రూ.70 వేల రూపాయల స్థిర పెట్టుబడి (ఎఫ్ డీ) చేశారు. ఈ ఆర్థిక సాయం ద్వారా భవిష్యత్తులో నందిత ఉన్నత చదువులకు ఉపయోగపడుతుందని విద్యార్థులు అన్నారు. ఈ సందర్భంగా 2012,13 పదవ తరగతి చదివిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, బాలల హక్కుల సంఘం నాయకులు అభినందించారు.
