నవదంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి…

1 Min Read

గజ్వేల్, 25 జూన్ 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో గురువారం జరిగిన వివాహ వేడుకకు ముఖ్య అతిథులుగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షరెడ్డి హాజరయ్యారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ కుమారుడు, జగదేవపూర్ రాగులరాజు కుమార్తెల వివాహ వేడుకకు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ శుభకార్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు నవదంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *