పారిశుధ్య పనులు చేపట్టాలి: మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో BRS కౌన్సిలర్ వినూత్న నిరసన..

Fasiuddin Mohammed
1 Min Read
Oplus_16908288

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి సెప్టెంబర్ 19/
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు (విద్యానగర్)లో గత నెల రోజులుగా పారిశుధ్య పనులు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డులో మున్సిపాలిటీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వీధులన్నింటిలోనూ చెత్తాచెదారం పేరుకుపోయి, తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారని BRS పార్టీ 33వ వార్డు కౌన్సిలర్ నాకోటి నగేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

వార్డులోని పారిశుధ్య సమస్యను తక్షణమే పరిష్కరించి, క్రమం తప్పకుండా పారిశుధ్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తూ కౌన్సిలర్ నాకోటి నగేష్ శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో నేల మీద కూర్చొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో మున్సిపల్ అధికారులు చెలగాటం ఆడవద్దని, వెంటనే వార్డులో పారిశుధ్య పనులను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు

📄 Generate e-Paper Clip
Share This Article