నారాయణగూడ ఐపీఎంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Fasiuddin Mohammed
1 Min Read

హైదరాబాద్, ఆగస్టు 15 రాయల్ పోస్ట్ న్యూస్ / : నారాయణగూడలోని ఐపీఎంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఐపీఎం టీఎన్జీవోస్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అసోసియేట్ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎం. సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్ యూనియన్ ఎల్లప్పుడూ ముందుండి కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వృత్తి భద్రత కోసం యూనియన్ నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ టీఎన్జీవోస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కోశాధికారి ఏ. శ్రీనివాస్‌తో పాటు పలువురు ఉద్యోగులు, యూనియన్ ప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

📄 Generate e-Paper Clip
Share This Article