నూతన ఎస్ఐగా బాధ్యతలుచేపట్టిన శ్రీకాంత్ రెడ్డి..

Fasiuddin Mohammed
1 Min Read


వలిగొండ ఆగస్టు14 రాయల్ పోస్ట్ న్యూస్ /

మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి భాధ్యతలు స్వీకరించారు.ఈయన నల్గొండ జిల్లా వాడపల్లి ఎస్ఐగా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా వలిగొండ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు.ఇక్కడ పనిచేసిన ఎస్ఐ యుగంధర్ గౌడ్,భువనగిరి ఎస్పీ ఆఫీస్ వీఆర్ కు బదిలీ చేశారు.ఈ సందర్భంగా నూతన ఎస్ఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తామని,చట్టాన్ని ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.గంజాయి రవాణా అరికట్టేందుకు కృషి చేస్తానని, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా గట్టి చర్యలు తీసుకుంటానని తెలిపారు. బదిలీపై వెళ్లిన ఎస్ఐ యుగంధర్ గౌడ్ కు పోలీస్ సిబ్బంది వీడ్కోలు పలికి నూతన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

📄 Generate e-Paper Clip
Share This Article