రాయల్ పోస్ట్ న్యూస్ /ఆగస్ట్ 12 భువనగిరి మండలం .

గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం
4 వ రాష్ట్ర మహాసభ ఆగస్టు 22, 23, 24 తేదీలలో చెంగిచెర్లలో
జయప్రదం చేయాలని కోరుతూ తాజ్ పూర్ గ్రామంలో బుధవారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గొర్రెల మేకల పెంకుందర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ గొర్రెల మేకల పెంపొందారుల సంఘం ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తయిందని ఈ సందర్భంగా నిర్వహించే 4 వ రాష్ట్ర మహాసభలు ఆగస్టు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెంగచెర్ల లో నిర్వహిస్తున్నామని అన్నారు. 1995 సంవత్సరంలో సంఘం ఏర్పడిందని, వాటి నుంచి నేటి వరకు అనేక పోరాటాలు చేసి, ముఖ్యంగా తుమ్మ చెట్లపై గొర్ల కాపరులకు హక్కు కల్పించే 1016 జీవో, మేతకు ప్రభుత్వ భూములు కేటాయించాలని 559 జీవో సాధించినట్లు తెలిపారు. గొర్రెలకు ఉచితంగా మందులు పంపిణీ చేసేందుకు కృషి చేసిందన్నారు.
గతంలో గొర్రెలకు ఇన్సూరెన్స్, ఎన్సిడిసి రుణాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయగా, సబ్సిడీ గొర్రెల్ల పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో గొల్ల కురుమలకు అవకాశం కల్పించి, యువతకు గొర్ల ఫామ్ షెడ్, గొర్రెల కొనుగోలు కోసం నేషనల్ లైవ్ స్టాక్ లో ప్రత్యేకంగా రాయితీ కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపందారుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దేవునూరి బాల్లయ్య, పాక జహంగీర్, దొడ్డి కొమరయ్య గొర్ల కాపరుల సంఘం అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్, గొర్ల కాపరుల సంఘం సభ్యులు సోమన బాలయ్య, సోమన నగేష్,
బిట్కూరి రమేష్, ర్యాకల నరసింహ, బిట్కూరి రామ్ లక్ష్మణ్, బాండ్ర రవి,
గుల్లని జంగయ్య, సురేష్, సోమన శివలింగం, బీట్కూరి లక్ష్మయ్య, దేవు నూరి భాస్కర్, ఓంకార్,
ర్యాకల జంగయ్య గొర్ల కాపరులు లు పాల్గొన్నారు.