రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 8/ స్వాతంత్త్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన అభివృద్ధికి ఆమడ దూరంలో దళితులు, దళిత వాడలు ఉన్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జల్లెల పెంటయ్య, కొండమడుగు నర్సింహ్మలు ఆవేదన వ్యక్తపరిచారు. శనివారం చౌటుప్పల మండల పరిధిలోని మసీదుగూడెం గ్రామంలో దళిత వాడలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది.ఈ సందర్భంగా పెంటయ్య, నర్సింహలు మాట్లాడుతూ గ్రామంలో దళిత కుటుంబాలు 25 ఉంటే కేవలం ఐదుగురికి మాత్రమే స్లాబ్ ఇండ్లు ఉన్నాయని మిగతా వారికి పెంకలు, రేకుల ఇండ్లు ఉండి ఇబ్బందులు పడుతున్నారని వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా ఐదు కుటుంబాలకు సెంటు భూమిలేదని మిగతా కుటుంబాలకు కూడా ఎకరంలోపు భూములు ఉన్నాయని వారందరికీ ప్రభుత్వం ఒక్కొక్కరికి 3 ఎకరాల భూమిని ఇవ్వాలని అన్నారు. దళితవాడలలో మురికి కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఉన్న మురికి కాలువలు కూడా అస్తవ్యస్తంగా ఉండి దోమల బెడదతో, వాసనతో ఆయా ఇండ్లలో ఉండలేకపోతున్నారని వివిధ జబ్బులకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని సూచించారు. నేటికీ విద్య , వైద్యం, ఉపాధి అందని ద్రాక్ష లాగే మిగిలిందని ప్రభుత్వం దళితులకు, నిరుపేదలకు ఉచిత విద్య , వైద్యం అందించాలని కోరారు. దళితులకు సంబంధించిన సబ్ ప్లాన్ నిధులను, ప్రత్యేక నిధులను కేటాయించి జిల్లా వ్యాప్తంగా అన్ని దళితవాడలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, మండల అధ్యక్ష, కార్యదర్శులు యాట బాలరాజు, చింతల సుదర్శన్, జిల్లా కమిటీ సభ్యులు మానే సాలయ్య, మండల కమిటీ సభ్యులు సంజీవ రమెష్ గ్రామ ప్రజలు చెక్క లింగస్వామి, రేణుక, శంకర్, నాగమ్మ , సురేష్, నాగలక్ష్మి, బక్క సురేష్, బాబు, సుజాత, రోనయ్య, యాదమ్మ , మల్లయ్య, అండాలు , పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

