ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వారానికి మూడు కోడి గుడ్లు ఇవ్వలేము… పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా డబ్బులు ఇవ్వాలి

_ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలు

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వారానికి మూడు కోడి గుడ్లు ఇవ్వలేము

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా డబ్బులు ఇవ్వాలి

_ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలు

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 20/ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా డబ్బులు ఇవ్వని యెడల వారానికి మూడు కోడి గుడ్లు ఇవ్వలేమని తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం మహిళలు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి కి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు ఊదరి వరలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలకు నెలకు పదివేల రూపాయల వేతనం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ప్రతి రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో రెండు కూరలు వండిపెడితే, ప్రభుత్వం కేవలం ఒక కూర వంటకు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇస్తుందని ఆమె అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, లేనిచో పెరిగిన ధరలకు అనుగుణంగా ఏజెన్సీ మహిళలకు అదనపు డబ్బులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలు , విజయ , స్వప్న, శోభ, స్వప్న ,వసంత, రమణ తదితరులు పాల్గొన్నారు

📄 Generate e-Paper Clip
Share This Article