నీట్-2026లో జాతీయ స్థాయిలో మెరిసిన సహ్యుకు ఘన సత్కారం
రాయల్ పోస్ట్ న్యూస్ హనుమకొండ, జూలై 18:
నీట్-2026 జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష లో వరంగల్‌కు చెందిన విద్యార్తి వీరయ్యగారి సహ్యు 720 మార్కులకు గాను ‘705″ మార్కులు సాధించి, జనరల్ క్యాటగిరీలో ఆల్ ఇండియా 9వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 1st ర్యాంకర్గా నిలిచి రాష్ట్రానికి, వరంగల్ జిల్లాకు విశిష్ట గుర్తింపు తీసుకురావడంతో పాటు, విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలిచారు. ఈ విశిష్ట విజయాన్ని పురస్కరించుకుని శనివారం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ మరియు టీఆర్ఎస్ హనుమకొండ– వరంగల్ జిల్లాల ఇన్‌చార్జి లయన్ డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వర్ రావు విద్యార్థి సహ్యు నివాసానికి వెళ్లి, ఆయనను మరియు వారి తల్లిదండ్రులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం బిర్లా విద్యా సంస్థల జ్ఞాపిక మెడల్‌ను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఫోన్ ద్వారా విద్యార్థి సహ్యుతో మాట్లాడి, ఆయన అసాధారణ విజయాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. బిర్లా విద్యా సంస్థల చైర్మన్, టిఆర్ఎస్ రాష్ట్ర నేత డాక్టర్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ..ఈ సందర్భంగా బిర్లా విద్యా సంస్థల చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నేత లయన్ డా. నడిపెల్లి వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా 9వ ర్యాంక్ సాధించి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన సహ్యు ప్రతిభ అభినందనీయమన్నారు. క్రమశిక్షణ, నిరంతర శ్రమ, లక్ష్యసాధనే విజయానికి మూలమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు.
అదేవిధంగా, టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత కూడా సహ్యుతో ఫోన్‌లో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించినట్లు డా. నడిపెల్లి వెంకటేశ్వర్ రావు తెలిపారు. సహ్యుకు, ఆయన తల్లిదండ్రులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వైద్య విద్యలో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అదే విధంగా సహ్యు మాట్లాడుతూ.. నీట్–2026లో ఆల్ ఇండియా 9వ ర్యాంక్ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం తన ఒక్కరిదే కాదని, తల్లిదండ్రుల అండదండలు, అధ్యాపకుల నాణ్యమైన బోధన, క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన ఫలితమేనని పేర్కొన్నారు. ఎస్‌ఆర్ కళాశాలలో రెండేళ్ల పాటు చదువుకున్న సమయంలో అధ్యాపకులు ప్రతి అంశాన్ని భావనాత్మకంగా అర్థమయ్యేలా బోధించారని, బట్టీ పట్టడం కంటే కాన్సెప్ట్‌లను పూర్తిగా అర్థం చేసుకోవడంపైనే తాను దృష్టి సారించానని చెప్పారు. తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ సన్మానించిన బిర్లా విద్యా సంస్థల చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నేత లయన్ డా. నడిపెల్లి వెంకటేశ్వర్ రావుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో వైద్య విద్యలో మరింత ప్రతిభ కనబర్చి సమాజానికి సేవ చేయడమే తన లక్ష్యమని సహ్యు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారి వర్థినేని లక్ష్మణ్ రావు, టిఆర్ఎస్ నాయకులు నిశాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.
