రమణానంద మహర్షిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్లకు హైకోర్టు తీవ్ర ఆదేశాలు!ఏడు రోజుల్లోగా వీడియోలు తొలగించకపోతే కోర్టు ధిక్కార చర్యలు

Fasiuddin Mohammed
2 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్,.
హైదరాబాద్/భువనగిరి (న్యూస్ డెస్క్):శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం వ్యవస్థాపకులు, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షిపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేస్తున్న పలువురు యూట్యూబర్లపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రమణానంద మహర్షి మరియు మహాపీఠానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియోలన్నింటినీ తక్షణమే తొలగించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.షి రిడి సాయిబాబాపై కొంతమంది యూట్యూబర్లు, పీఠాధిపతులు చేస్తున్న విమర్శలకు సమాధానంగా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ఇటీవల (2026 జూన్ 14న) శిరిడిలో ‘శత ప్రశ్న శరసంధానం’ అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు. 100 కోణాలలో సాయిబాబా చరిత్రను ప్రామాణికంగా వివరిస్తూ ఈ పుస్తకాన్ని ఆయన రూపొందించారు. ఆ తర్వాత తానేలాంటి వాదోపవాదాలు చేయబోనని, దైవదీక్షలో నిమగ్నమవుతున్నట్లు ప్రకటిస్తూ, శిష్యులను కూడా శాంతంగా ఉండాలని మహర్షి ఆదేశించారు.అయితే, దీనిని తట్టుకోలేని కొంతమంది యూట్యూబర్లు కుయుక్తులతో మహర్షిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అసత్య ఆరోపణలతో విమర్శలు కొనసాగించారు. ఈ క్రమంలో మహాపీఠం ట్రస్ట్ సభ్యులు భువనగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పదిమంది యూట్యూబర్లపై ఎన్ఐఆర్ (NIR) నమోదైంది. అయినా సరే సదరు యూట్యూబర్లు హద్దుమీరి నిందాపూర్వక వీడియోలు చేస్తుండటంతో మహాపీఠం ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాలు:
ఈ పిటిషన్‌పై చట్టరీత్యా విచారణ జరిపిన గౌరవ హైకోర్టు కింది విధంగా ఉత్తర్వులు జారీ చేసింది:

వీడియోల తక్షణ తొలగింపు: సోషల్ మీడియాలోని అన్ని వేదికల (యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర) నుండి మహాపీఠానికి, మహర్షికి వ్యతిరేకంగా ఉన్న అన్ని వివాదాస్పద వీడియోలను తక్షణమే తీసివేయాలి.

కొత్త వీడియోలపై నిషేధం: రమణానంద మహర్షిపై మళ్లీ ఎలాంటి కొత్త వీడియోలు పెట్టరాదు, వేరే వాటిని సర్కులేట్ చేయకూడదు.

7 రోజుల గడువు: ఈ ఆదేశాలు వెలువడిన ఏడు రోజుల లోపల సదరు వీడియోలన్నింటినీ పూర్తిగా డిలీట్ చేయాలి.

కోర్టు ధిక్కార చర్యలు: గడువులోగా వీడియోలు తొలగించని పక్షంలో, తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు భావించి వారిపై ‘కోర్టు ధిక్కార నేరం’ (Contempt of Court) కింద కఠిన శిక్షలు ఉంటాయి.

అందరికీ వర్తింపు: ఈ తీర్పు కేవలం సదరు యూట్యూబర్లకే కాకుండా, రమణానంద మహర్షిపై దుష్ప్రచారం చేసే ఇతరులకు కూడా వర్తిస్తుంది.

ప్రధానంగా కోర్టు ఆదేశాలు ఎదుర్కొంటున్న వారు:
కాకుమాను లలిత్ కుమార్ (ఫౌండర్, హిందూ జనశక్తి)

వేదబ్రహ్మ లలిత కృష్ణ శాస్త్రి (శ్రీరామ జయం యూట్యూబ్ ఛానల్)

దువ్వాడ శివ ప్రసాద్ చౌదరి (భారతవర్ష యూట్యూబ్ ఛానల్)

అపరాజిత కౌండిన్య (ధర్మోపాసన యూట్యూబ్ ఛానల్)

శ్రీ కాంత్ శర్మ (ఫౌండర్, హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్)

కిల్లి భాస్కర రావు (అభాస్కరకిల్లి80 యూట్యూబ్ ఛానల్)

సంతోష్ కుమార్ ఘానాపాటి (हिन्दू धर्म क्षेत्रम् యూట్యూబ్ ఛానల్) మరియు ఇతరులు.

న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలను అన్ని రకాల సోషల్ మీడియా సంస్థలు, నెటిజన్లు కచ్చితంగా పాటించాలని, చట్టాన్ని గౌరవించాలని శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం ఈ ప్రకటన ద్వారా కోరింది.

📄 Generate e-Paper Clip
Share This Article